'నా పేరు సూర్య'లోను హైలైట్ గా నిలవనున్న నదియా పాత్ర!

  • బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
  • ఆయనకి తల్లి పాత్రలో నదియా
  • వచ్చేనెల 4వ తేదీన విడుదల
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా నదియాకి మంచి క్రేజ్ వుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో వున్నాయి. అలాంటి నదియా రీ ఎంట్రీ లోను అద్భుతమైన పాత్రలను చేస్తూ అదరగొట్టేస్తోంది. 'దృశ్యం' .. 'అత్తారింటికి దారేది' సినిమాలు ఆమెకు మరింత మంచిపేరును తెచ్చిపెట్టాయి.

'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కి మేనత్తగా నటించిన నదియా, 'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ కి తల్లి పాత్రను పోషించింది. ఈ పాత్రను వక్కంతం వంశీ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. నదియా కెరియర్లోనూ ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు. మే 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.         
Go Back to Shorts
allu arjun
anu emanuel
nadiya

More Telugu News